Fri Dec 05 2025 15:32:35 GMT+0000 (Coordinated Universal Time)
Earth Quake : రష్యాలో భూకంపం.. తీవ్రత ఎంతంటే?
రష్యాలో భూకంపం సంభవించింది. ఆదివారం ఉదయం భూప్రకంపనలు కనిపించడంతో ప్రజలు భయాందోళనలతో పరుగులు తీశారు

రష్యాలో భూకంపం సంభవించింది. ఆదివారం ఉదయం భూప్రకంపనలు కనిపించడంతో ప్రజలు భయాందోళనలతో పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత ఏడుగా నమోదయిందని అధికారులు తెలిపారు. భూకంపం తూర్పు కంచట్కా ద్పీపకల్ప తీరంలో ఉందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే అధికారులు తెలిపారు.
ప్రాణ, ఆస్తినష్టం...
ఈ ప్రభావంతో సునామీ హెచ్చరికలను జారీ చేసింది. భూకంప తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు వణికి పోయారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఈ భూకంపం వల్ల ప్రాణ, ఆస్తినష్టం పై అధికారికంగా మాత్రం ఎటువంటి ప్రకటన విడుదల కాలేదు. ప్రజలు మాత్రం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
Next Story

